Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రామ్‌, బోయపాటిల మూవీ పేరు స్కంధ

ఆకట్టుకుంటున్న టైటిల్‌ గ్లింప్స్‌
బోయపాటి శ్రీను `రామ్‌ పోతినేని కాంబో చిత్రం ఒకటి.  తాజాగా ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ విడుదలై ఆకట్టుకుంటూ సినిమాపై మరింత హైప్ను పెంచింది.

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

’అఖండ’ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా అవ్వడం అంచనాలు కాస్త భారీగానే ఉన్నాయి.

ఈ సినిమాలో రామ్‌ పవర్‌ ఫుల్‌ అండ్‌ మాస్‌ లుక్‌ కాస్త కొత్తగానే ఉంది. ’విూరు దిగితే ఊరు ఏదైతే ఉండదో నేను దిగితే మిగిలేది ఉండదు’ అంటూ రామ్‌ చెప్పిన డైలాగ్‌ అదిరిపోయింది.

ఈ సినిమాకి అందరు ఊహించినట్టుగానే పవర్‌ ఫుల్‌ టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ’స్కంద’ అనే బలమైన టైటిల్ను ఫిక్స్‌ చేశారు.

రీసెంట్గా ’24 రోజుల పాటు యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించారు.

పక్కా భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో  శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

సెప్టెంబర్‌ 15వ తేదీన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.