Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సలార్ పై పెరుగుతున్న అంచనాలు

సలార్‌ టీజర్‌ 6న విడుదల
ప్రభాస్‌ నటిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ’సలార్‌’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీలక పాత్రలపై చిత్రీకరణ పూర్తయింది.

ఈ వారంలోనే ’సలార్‌’ టీజర్‌ను విడుదల చేయనున్నారు. దానికి ఈ నెల 6న ముహూర్తం కుదిరింది. ఈ గురువారం ఉదయం 5.12 నిమిషాలకు టీజర్‌ విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ట్విట్టర్‌ వేదిక ప్రకటించింది

ప్రభాస్‌, శ్రుతీహాసన్‌ జంటగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ’కె.జి.ఎఫ్‌.’ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ ` హోంబలే సంస్థ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఈ చిత్రంలో పాటు ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కె, మారుతి దర్శకత్వంలో ’రాజా డీలక్స్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాలతో బిజీగా ఉన్నారు.

ఇది కూడా చదవండి….నాలుగో చిత్రంతో రికార్డులు బద్దలేనా…?