Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నా భర్త నాకే కావాలంటూ పెట్రోల్ పోసుకోని…

మోటకొండూరు: జులై 03(నిజం చెపుతాం)

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పన్నీరు రాజేష్ (28) తండ్రి యాదగిరి (60) గత 6 సంవత్సరాల క్రితం ఆలేరు మండలము కొల్లూరు గ్రామానికి చెందిన పూజ (25) అనే యువతితో వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు కూతుర్ల సంతానం పెద్ద కూతురు యక్ష శ్రీ (4) చిన్న కూతురు హారిక (2) అయితే వీరు పూసలి కులస్తులు కావడంతో వ్యాపార రీత్యా కుటుంబ అంత కలిసి మహబూబ్నగర్, అమనగల్ ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసుకుంటూ తిరిగి గ్రామానికి వచ్చేవారు …గత 2 సంవత్సరాల క్రితం వ్యాపార ప్రాంతం అయిన అమనగల్లు లో ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం కోనసాగిస్తూ భార్య పూజని దూరం పెడుతూ వచ్చాడు

ఇదే విషయమై కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి ..అయితే సోమవారం గ్రామపెద్దల,కుటుంబం సమక్షంలో గ్రామంలో మాట్లాడే ప్రయత్నం చేయగా అక్కడ కూడా తన భార్య తనకు వద్దని రాజేష్ చెప్పడంతో మనస్థాపానికి గురైన రాజేష్ భార్య పూజ సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో రాయగిరి మోత్కూరు ప్రధాన రహదారిలో ముత్తిరెడ్డిగూడెం చౌరస్తా వద్ద పెట్రోలు బాటిల్ తీసుకొని తమ ఇద్దరు పిల్లలలో సహా ఆత్మహత్యయత్నం చేసింది.

విషయం గమనించిన స్థానికులు ఆమె వద్ద నుండి పెట్రోల్ బాటిల్ తీసుకొవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం బాధితురాలు గ్రామస్థులు కుటుంబ సభ్యులతో కలిసి గంట సేపు ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు…

బాధితురాలు రాజేష్ భార్య పూజ….

మాకు పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది ఇద్దరు కుతుర్లు ఉన్నారు నా భర్త అమనగల్లు దగ్గర ఇంకో అమ్మాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ను అందంగా లేవు నాకు నువ్వు వద్దు అంటున్నాడు…… చాలా సార్లు ఈ విషయంలో గొడవలు జరిగాయి

ఈరోజు కూడా పెద్ద మనుషులతో మాట్లాడించే ప్రయత్నం చేయాగ నాకు నువ్వు వద్దు ఏమైనా చేస్కో అని అంటున్నాడు …ఇంట్లో అత్త మామతో కూడా గోడవలు జరిగాయి ..ఒక సారి ఇంట్లో గ్యాస్ లీకేజీ కూడా జరిగింది ….వారితో నాకు ప్రాణ హాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ……దయచేసి నా భర్త ని నాకు ఇప్పించగలరని అధికారులని గ్రామ పెద్దలని,గ్రామస్థులని వేడుకుంది…..

బాధితురాలు పూజ పిన్ని :-

మా బిడ్డ పూజకి తల్లి తండ్రులు లేరు మేమే దగ్గరుండి వారి వివాహం దగ్గరుండి చేసాము అన్ని విషయాలు పెళ్లిలో అబ్బాయి కుటుంబ సబ్యులకు చెప్పడం జరిగిందని కానీ కొంత కాలంగా వీరి మధ్యలో గోడవలు జరుగుతుడడంతో ఇరువురి మధ్య సర్ది చెప్పే ప్రయత్నం చేసాము

ఈరోజు కూడా ప్రయత్నం చేయగా రాజేష్ వినకపోవడంతో ఈ మా బిడ్డ ఈ అఘాయిత్యానికి పాల్పడింది … అదృష్టం బాగుండి మా బిడ్డకు ఎం జరగలేదు….వారి కుటుంబ సబ్యుల నుండి కూడా మా బిడ్డకు ప్రాణహాని ఉందని మా బిడ్డకు రక్షణ కల్పించాలని అలాగే మా బిడ్డకు తన భర్త ని అప్పగించి వివాహేతర సంబందం కొనసాగితున్న యువతిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.