Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో భారీ కుంభకోణం

పి. ఏ. సి. ఎస్ లో భారీ కుంభకోణం.

* 96 లక్షలు స్వాహా చేసిన సి. ఈ. ఓ .

ఏపీ స్టేట్ బ్యూరో నిజం న్యూస్.

రైతులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో భారీ కుంభకోణానికి తెరలేపి ఏకంగా 96 లక్షల రూపాయలు ఎంచక్కా దోచేశాడు అక్కడ సి.ఈ.ఓ.

కంచే చేను మేసిన చందంగా సోసైటీ ని అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన సి. ఈ. ఓ నే అవకతవకలకు పాల్పడడం దారుణం.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో సీ. ఈ. ఓ పనిచేసిన పిట్టా. చలపతిరావు సిబ్బంది జీతభత్యాలు, పి. ఎఫ్, ఏరియర్స్ వారికి తెలియకుండా సొసైటీ ఖాతా నుంచి 96 లక్షల రూపాయలు డ్రా చేసుకొని కాజేశాడు.

ఈ ఏడాది మే నెలలో పదవీ విరమణ పొందిన చలపతిరావు పై పలు అవినీతి ఆరోపణలు ఉండడంతో పదవీ విరమణ ప్రయోజనాలు అందవనే ఉద్దేశంతో సిబ్బంది కి చెందిన సొమ్మును పక్కాప్లాన్ తో కాజేశాడు. ఈ విషయం ఆడిట్ లో బయట పడడంతో పోలీస్ లకు ఫిర్యాదు చేసినట్టు డిసిసిబి మేనేజర్ నాయుడు తెలిపారు.

ఈ విషయంపై సోమవారం పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు.