మెట్రో రైలులో స్టూడెంట్ పాస్
విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలులో స్టూడెంట్ పాస్ అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇవాళ్టి నుంచి విద్యార్థుల పాస్ లను మెట్రో అందుబాటులోకి తెచ్చింది. 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది.
1 ఏప్రిల్ 1998 తర్వాత జన్మించిన విద్యార్థులు మెట్రో పాస్ తీసుకునేందుకు అర్హులుగా నిర్ణయించింది.
స్టూడెంట్ పాసుల చెల్లుబాటుకు 9 నెలల కాల పరిమితి విధించింది.
తీసుకున్న మెట్రో పాస్‌లు నేటి నుంచి 31 మార్చి 2024 వరకు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.