ఆషాడ మాసం మహిళలకు ప్రత్యేకం…
ఆషాడ మాసం వచ్చిందంటే ప్రతి స్త్రీ తన చేతులు నిండుగా ప్రకృతి వనమూలికలతో తయారు చేయబడిన గోరింటాకును అందంగా చేతుల నిండుగా అలంకరించుకునే మాంసం ఆషాడ మాసం అని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు చీకూరి లీలావతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి సాంప్రదాయపద్ధంగా గోరింటాకును కోసుకొని ఆచారాలతో పుత్రం తో రుబ్బుకొని సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ చిన్న పెద్ద అందరు కలిసి గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆషాడ మాసంలో వచ్చే రుగ్మతులను తట్టుకునే చర్మ రోగాలను, స్త్రీలలో గర్భసంచి సమస్యల నుండి కూడా గోరింటాకు నివారిస్తుందని, ఎన్నో ఔషధాలతో కూడిన ఆకు గోరింటాకు కాబట్టి స్త్రీ పురుషులు ఎవరైనా పెట్టుకోవచ్చని, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందన్నారు.
ఈ గోరింటాకు పండుగను దేశవ్యాప్తంగా జరుపుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆషాడ మాసంలో ఒకరోజు మెహందీ డే గా ప్రకటించాలని కోరారు.