Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మంటల్లో 25 మంది సజీవ దహనం

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జూలై 01

(నిజం చెపుతాం)

పుణె: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం. జరిగింది. బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

32 మంది ప్రయాణికులతో యావత్మాల్నుంచి పుణెకు వెళ్తుండగా శనివారం వేకువజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

మంటలు ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.