బతుకమ్మ చీరెలకు నిధులు విడుదల
బతుకమ్మ చీరెల కోసం రాష్ట్ర ప్రభుత్వం 351.52 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డల కోసం బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తుంది.
18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తారు.
రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు కోటికి పైనే ఉన్నారు.
బతుకమ్మ చీరెల కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 400 కోట్లను కేటాయించింది.
వాటిలో నుండి బతుకమ్మ చీరెల కోసం రాష్ట్ర ప్రభుత్వం 351.52 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి…రెండు మండలాల్లో నలిగిపోనున్న నాలుగు గ్రామాల ప్రజలు