సహకార గోదాం కొరకు స్థలం కేటాయించాలి.

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆళ్లపల్లి మండల కేంద్రంలో నిర్మించనున్న గోదాంకు స్థలాన్ని కేటాయించాలని గుండాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు గోగ్గేల రామయ్య ఆళ్లపల్లి తాసిల్దార్ అంజాద్ పాషాకు దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆళ్లపల్లి మండలంలో గోదాం అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల కేంద్రంలో గోదాం నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయించాలని తాసిల్దార్ కు దరఖాస్తు చేశామని, స్థలం కేటాయింపు అనంతరం త్వరలోనే గోదాం నిర్మాణం చేపట్టి రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. అంతేకాకుండా పిఎసిఎస్ విభజన అనంతరం మండల కేంద్రంలో కార్యాలయ ఏర్పాటుకు ఈ స్థలం ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోపరేటివ్ డైరెక్టర్ హఫీజ్, టిఆర్ఎస్ మండల నాయకులు బుర్ర వెంకన్న, ఆదాం తదితరులు పాల్గొన్నారు.