Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నకిలీ మావోయిస్టులు అరెస్టు

నకిలీ మావోయిస్టులను అరెస్టు చేసిన పలిమల పోలీసులు

పలిమెల (భూపాలపల్లి) జూన్ 30 (నిజం చెబుతాం).

ఈనెల 20వ తేదీన పంకెన సర్పంచ్ బొచ్చు శ్రీనివాస్ కు నలుగురు నిందితులు ఒక మావోయిస్టు లెటర్ ప్యాడ్ ద్వారా ఐదు లక్షల రూపాయల డబ్బు మావోయిస్ట్ పార్టీకి విరాళంగా ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
వివరాల్లోకి వెళితే, పలిమల మండలంలోని పంకెన గ్రామానికి చెందిన ఎర్ని సోమయ్య తండ్రి వెంకటయ్య, మరియు అతనికి హైదరాబాదులో పనిచేసినప్పుడు పరిచయమైన ఎలుకల పల్లి గ్రామం పాలకుర్తి మండలానికి చెందిన, చిలుముల తిరుపతి తండ్రి పోచమల్లు, అను ఇద్దరూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండేవారు.

ఇలా ఉండగా వారిద్దరు కలిసి ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో మావోయిస్టు నెపంతో డబ్బున్న వ్యక్తులను బెదిరించి ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనుకున్నారు.

ఇందులో భాగంగా వీరు ఇరువురు కలిసి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పంకెన సర్పంచ్ కి ఒక మావోయిస్టు లెటర్ ద్వారా ఐదు లక్షలు అడుగుదామని అనుకోని దీనికి సంబంధించి యూట్యూబ్ నందు మావోయిస్ట్ కరపత్రాలు పరిశీలించి ఒక పథకం రచించాలని భావించి, దీనికి మరో ఇద్దరు గోదావరిఖని గ్రామానికి చెందిన తిరుపతి బావమరిది అయిన ఈర్ల చందర్ మరియు జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు టేకుల సుధీర్ అవసరమని భావించి వీరికి పథకం గురించి వివరించి దీనికి సంబంధించిన మావోయిస్టు రెడ్ లెటర్స్ తో లెటర్ ప్యాడ్ తయారుచేసి తేదీ 15 జూన్ 2023 రోజున హైదరాబాదులోని ఒక పోస్ట్ ఆఫీస్ నుండి పంకెన సర్పంచ్ బొచ్చు శ్రీనివాస్ కి, మరియు రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ కి పోస్ట్ చేశారు.

పోస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత ఒక ఫోన్ నెంబర్ నుండి పంకెన సర్పంచ్ కి ఫోన్ చేసి మరల మావోయిస్టునెపంతో 5 లక్షల రూపాయలను కరీంనగర్ బస్టాండ్ నందు ముట్ట చెప్పాలని బెదిరించారు. వెంటనే భయభ్రాంతులకు గురైన పంకెన సర్పంచ్ ఆలస్యంగా తేదీ 29 జూన్ 2023 రోజున పలిమెల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశాడు.

కాగా అదే రోజు పంకెన గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఈర్ని సోమయ్య గ్రామానికి రాగా, పలిమెల పోలీసులకు అందిన సమాచారం మేరకు,అతని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ పథకంలో భాగంగా ఉన్న మిగతా ముగ్గురిలో తిరుపతిని హైదరాబాదు నందు మరియు రామచందర్, సుదీర్ అను ఇద్దరినీ గోదావరిఖని నందు పలిమెల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వివరాలు.1 ఏర్ని సోమయ్య తండ్రి వెంకటయ్య వయసు 39 కులం ఎస్సీ మాల గ్రామం పంకెన మండలం పలిమెల, 2 చిలుముల తిరుపతి తండ్రి పోచమల్లు వయస్సు 43 కులం ఎస్సీ మాదిగ గ్రామం ఎలుకలపల్లి రామగుండం మండలం. 3 ఏర్ల రామచందర్ తండ్రి రాజయ్య వయసు 37 గ్రామం గోదావరిఖని రామగుండం మండలం. 4 టేకుల సుధీర్ తండ్రి శ్రీనివాస్ వయసు 31 గ్రామం గోదావరిఖని రామగుండం మండలం. నిందితుల వద్ద నుండి స్వాధీనపరచుకున్న సొత్తు వివరాలు.

నాలుగు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు, మూడు మావోయిస్టు లెటర్ ప్యాడ్స్, ఒక కలర్ ప్రింటర్. పట్టుకోవడంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చాకచక్యంగా వ్యవహరించిన కాలేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావు, పలిమేల ఎస్సై అరుణ్, 2వ ఎస్ఐ శివ, కానిస్టేబుళ్లు బాల్ సింగ్, శ్యామ్, మధు, సమ్మయ్య, అరుణ్, సంతోష్, మరియు హోంగార్డు తిరుపతి నీ భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, మరియు కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి అభినందించారు.