Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రెండు మండలాల్లో నలిగిపోనున్న నాలుగు గ్రామాల ప్రజలు 

రెవెన్యూ, బుగులోని, మినీ మేడారం జాతరలతో డైరక్టర్ పదవులు కోల్పోయిన గ్రామాలు

మనో వేదన చెందుతున్న ఆయా గ్రామాల ప్రజలు.

బుగులోని జాతర,పాండవుల గుట్ట, మినీ మేడారం జాతరలకు

ఈ నాలుగు గ్రామాల రహదారులే కీలకం.

– తిరుమలగిరి – జగ్గయ్యపేట 3 కి.మి వరకు రహదారి నిర్మించాలి

– తిరుమలగిరి నుండి గోరి కొత్తపల్లి 7 కి. మీ దూరం

తిరుమలగిరి గ్రామం రేగొండ మండలంలో,జగ్గయ్యపేట సుల్తాన్ పూర్, వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట గ్రామాలు మరో మండలం గోరికొత్తపల్లిలో చేరాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా జూన్ 30 నిజం చెపుతాం
*- తిరుమలగిరి గ్రామానికి చెందిన రైతులకు జగ్గయ్యపేటలో,జగ్గయ్యపేట శివారులో తిరుమలగిరి గ్రామానికి చెందిన భూములు, తిరుమలగిరి రెవెన్యూ భూములు సుల్తాన్ పూర్, వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట గ్రామాలకు చెందిన రైతులకు ఉంటాయి.

ఈ గ్రామాల రైతులకు ఇబ్బందులు భూములు రేగొండ మండలంలో జనాభా పరంగా మరో మండలం గోరికొత్తపల్లి మండలంలో ఉండడం వలన తప్పని తిప్పలు. -తిరుమలగిరి అటవీ శాఖ బీట్ కోనరావుపేట వరకు అడవులు, బుగులోని గుట్టలు, విస్తరించి – బుగులోని, మిని సమ్మక్క సారలమ్మ జాతరలు రేగొండ మండలంలో మరో మండలం గోరికొత్తపల్లిలో ఉండడం వలన ఈ గ్రామాల ప్రజలు గొడవలు,తగాదాలు నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

బుగులోని జాతర, మినీ సమ్మక్క సారలమ్మ జాతరలు, అటవీ ప్రాంతం, భూములు పూర్వం నుండి ఈ గ్రామాలకు అనుబంధంగా,ఈ గ్రామ శివారులో ఆనుకొని ఉంది.

తిరుమలగిరి గ్రామం నుండి బుగులోని జాతర 6 కి. మీ, జగ్గయ్యపేట, సుల్తాన్ పూర్,వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట ద్వారా 3 నుండి 4 కి. మీ దూరం బుగులోని జాతర ఈ గ్రామాల రహదారుల వెంట అధికంగా రవాణా జరుగుతుంది.

భక్తులు తరలివచ్చి మొక్కలు తీర్చుకుంటారు.

తిరుమలగిరి గ్రామ ప్రజలు సహకరించాలి.

స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు స్పందించి తిరుమలగిరిని గోరికొత్తపల్లి మండలంలో విలీనం చేయాలని ఈ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.