Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బిఆర్ఎస్ పార్టీకి సామెల్… రాం..రాం

పార్టీ సభ్యత్వానికి, ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి కి పంపుతున్నట్లు తెలిపారు.

బి ఆర్ఎస్ లో ఉద్యమ నాయకులకు… చిన్న చూపు, కేటీఆర్ ప్రకటనపై ఆవేదన.. రాజీనామాకు సిద్ధం.

తుంగతుర్తి అసెంబ్లీ బరిలో పోటీ చేస్తా… ఉద్యమ నాయకుడు మందుల సామెల్ వెల్లడి.

సూర్యాపేట ప్రతినిధి జూన్ 30 నిజం చెబుతాం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తుంగతుర్తి నియోజకవర్గం నుండి అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ ధీరుడు మందుల సామెల్ గడిచిన 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటూ, నియోజకవర్గంలో ఎన్నో ఇన్చార్జి పదవులను తీసుకొని మచ్చలేని నాయకునిగా ఎదిగి మొదటి దఫా టిఆర్ఎస్ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులను గెలిపించిన ఘనత సామెల్ కు దక్కింది, అవకాశములో ముఖ్యమంత్రి 2సార్లు చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారు.

ముఖ్యమంత్రి మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు అవకాశం కల్పిస్తారని కాలం గడుపుతున్నారు. తిరుమలగిరిలో జరిగిన ప్రగతి నివేదన సభలో మూడోసారి కూడా ఎమ్మెల్యే డాక్టర్ కిషోర్ కుమార్ కే టికెట్టును ఐటి పురపాలక శాఖ మంత్రి కె టి ఆర్ నిండు సభలో ప్రకటించడంతో ఆవేదనకు గురై పార్టీలో కష్టపడి పనిచేసినప్పుడు గుర్తింపు లేక పోయిందని , స్థానిక నాయకులతో మాట్లాడి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం అరవ పెళ్లి ప్రెస్ మీట్ లో ప్రకటించారు.

రాజీనామా లేఖన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి పోటీ ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశారు…