Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మానుకోట జిల్లా జర్నలిస్టులపై డిపిఆర్ఓ కు కోపమా ?లేక ప్రేమా?   

మహబూబాబాద్, జిల్లా ప్రతిని ధి, జూన్ 30, నిజం న్యూస్)

రాష్ట్ర మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ పర్యటన నిమిత్తం వచ్చిన సందర్భంగా పాత్రికేయులకు జిల్లా డిపిఆర్ఓ శ్రీనివాస్ ఏర్పాటు చేసి వాహనం. ఇందులో జిల్లా విలేకరులు ప్రయాణం చేసి కేటీఆర్ వార్తలు సేకరించి పంపించాలి.

పాత్రికేయులతోటి నిన్న జరిగిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా జర్నలిస్టుల ను గౌరవించవలసిన బాధ్యత ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీల మీద ఉన్నదని అన్నారు.

మరి నిన్నటికి ఈరోజుకు జర్నలిస్టులపై ఏం తేడా వచ్చిందో ఏమో? జిల్లా డిపిఆర్ఓ  జర్నలిస్టుల మీద ప్రేమా? కోపమా? తెలియదు కానీ జర్నలిస్టులకు వార్తా సేకరణ కొరకు ఎంపిక చేసిన వాహనాన్ని చూడండి.

సరుకులు తెచ్చే వాహనాన్ని జర్నలిస్టుల కొరకు సమకూర్చారు. జిల్లాలో కొందరు సీనియర్ పాత్రికేయులు కూడా ఉన్నారు. మరి వారు ఈ వాహనాన్ని ఎక్కి వార్తా సేకరణ చేయగలరా? డి పి ఆర్ ఓ జిల్లా విలేకరులకు ఇచ్చే గౌరవం ఇదేనా?

జిల్లా జర్నలిస్టులు అంటే డిపిఆర్ఓ శ్రీనివాస్ కు అంత చులకన ఎల. మరి దీనిపై జిల్లా పాలనాధికారి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ,ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.