Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు బలరాం నాయక్ హౌజ్ అరెస్ట్

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూన్ 30, (నిజం న్యూస్):

ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా వాటిని కాలరాస్తున్న మంత్రికి ప్రజలే బుద్ది చెబుతారు,కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు.

కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మహబూబాబాద్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.బలరాం నాయక్ ఇంటి వద్ద భారీగా మోహరించినపోలీసులు.

కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న, పోలీసులు,పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బలరాం నాయక్ ,కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్.

మహబూబాబాద్ లో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ ని హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు.

పట్టణంలోని వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలను అర్థరాత్రి కొందరినీ హౌస్ అరెస్టు, మరి కొందరిని వివిధ పోలీస్ స్టేషన్ వరకు తరలించారు.

లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులను, రాష్ట్ర నాయకులను, సిపిఐ జిల్లా బాధ్యులను, సిపిఎం జిల్లా నాయకులను, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులను నిన్న అర్ధరాత్రి నుండి అరెస్టు కార్యక్రమాలను పోలీసులు కొనసాగించారు.

వీరిలో కొందరిని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లకు మరికొందరిని తరలించారు.

వీరి అక్రమ అరెస్టులను రాష్ట్ర స్థాయి నాయకత్వాలు తీవ్రంగా ఖండించాయి. వీరి అక్రమ అరెస్టులు చూస్తుంటే ఎమర్జెన్సీ కాలం గుర్తుకొస్తుందని కొందరు రాష్ట్ర నాయకులు ఘాటుగా విమర్శించారు.