తాళి, మెట్టెలు తీయాల్సిన అవసరం లేదు
గ్రూప్ 4 పరీక్ష రాసే వివాహిత మహిళలు తాళి బొట్టు, మెట్టెలు తీయాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని తీయాల్సిన అవసరం లేదని టీఎస్ పీఎస్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి తెలిపారు.
పరీక్ష నిర్వహణకు అత్యంత పకడ్భందీగా ఏర్పాట్లను చేసామన్నారు.
40 వేల మంది ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చామని, ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షను నిర్వహించనున్నామని తెలిపారు.
పరీక్ష సెంటర్లలో యువతీ, యువకుల కోసం ప్రత్యేక చెకింగ్ పాయింట్లను చేపట్టినట్లు తెలిపారు. సరిపడా మహిళా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
హిందూ సంప్రదాయాలను కించపరిచేలా కొందరు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దని తెలిపారు.
అభ్యర్తులు రెండు గంటల ముందే పరీక్ష సెంటర్ కు చేరుకోవాలని సూచించారు.