గ్రూప్-4 పరీక్షకు 6 పద్ధతుల్లో తనిఖీలు
గ్రూప్ 4 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 2878 కేంద్రాల్లో 40 వేల మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షనలో 9,51,205 మంది అభ్యర్థులు పరీక్షను రాయనున్నారు.
8039 ఉద్యోగాలకు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 8,50 లక్షల మంధి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు.
6 పద్ధతుల్లో తనిఖీలు చేయనున్నారు. అవి గేటు దగ్గర, పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్లను పరిశీలిస్తారు.
ఏదైనా గుర్తింపు కార్డు ఉందా లేదా అని తనిఖీ చేస్తారు.
నామినల్ రోల్ లో పేరు ఉందా లేదా అని పరిశీలించనున్నారు.
నామినల్ రోల్ లో ఉన్న ఫోటోను, ఐడీలో ఉన్న ఫోటోను తనిఖీ చేస్తారు.
సంతకాలను సరి పోల్చనున్నారు.
చివరగా వేలి ముద్రలను తీసుకుంటారు.
ఇది కూడా చదవండి….పరీక్ష కు 15 నిముషాల ముందే గేట్ల మూత