పరీక్ష కు 15 నిముషాల ముందే గేట్ల మూత
గ్రూప్ 4 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 2878 కేంద్రాల్లో 40 వేల మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షనలో 9,51,205 మంది అభ్యర్థులు పరీక్షను రాయనున్నారు.
8039 ఉద్యోగాలకు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 8,50 లక్షల మంధి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు.
రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు మొదటి పేపర్, మద్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుంది.
పరీక్ష కు 15 నిముషాల ముందే గేట్లను మూసి వేయనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్ధూ మీడియాల్లో పరీక్ష పేపర్ ఉంటుంది.
ఇది కూడా చదవండి…వెల్ఫేర్ అసిస్టెంట్ సస్పెన్షన్ కు, పంచాయతీ కార్యదర్శి కి మెమో కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు