వెల్ఫేర్ అసిస్టెంట్ సస్పెన్షన్ కు, పంచాయతీ కార్యదర్శి కి మెమో కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
ఆకివీడు. నిజం న్యూస్
ఆకివీడు మండలం పదకాపవరం డిజిటల్ అసిస్టెంట్ ఎస్. కిరణ్ ను సస్పెండ్ చేయాలని, అలాగే ఇంచార్జి పంచాయతీ కార్యదర్శి నారాయణరావు కు మెమో ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు.
ఆకివీడు మండలంలో పదకాపవరం చినకాపవరం గ్రామాల్లో జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం అమలు తీరుపై మండల అధికారులు సచివాలయ సిబ్బంది తో కలెక్టర్ సమీక్షించారు.
పదకాపవరం వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఇంచార్జి డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కంప్యూటర్ ఆపరేషన్ పనులను ప్రయివేటు వ్యక్తుల చేత చేయిస్తుండడం గమనించిన కలెక్టర్ వెంటనే వెల్ఫేర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
అలాగే ఈ విషయం తెలిసీ కూడా తెలియజేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న ఇంచార్జి పంచాయతీ కార్యదర్శి నారాయణరావు కు మెమో ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు.
అనంతరం ఎంపీడీవో కందుల వాణి తో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయలక్మి, తహసీల్దార్ విజయలక్ష్మి, సర్పంచ్ బేబి స్నేతు, పాతపాటి శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు.