గ్రూప్-4 లో మెరిట్ సాధిస్తే వచ్చే ఉద్యోగాలివే
TSPSC ద్వారా దాదాపు 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 1-12-2022న విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న వారు జులై 1న ఆయా పోస్ట్ లకు పరీక్షను రాయనున్నారు. పరీక్షలో మెరిట్ మార్కులను సాధించిన వారు ఏఏ ఉద్యోగాలను సాధించనున్నారో ఒక సారి పరిశీలిద్దాం.
గ్రూప్-4 నోటిఫికేషన్ లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్ అండ్ వార్డ్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాల్లో ప్రధానంగా 3 కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. వీటిలో అత్యధికంగా మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859 ఉన్నాయి. ఉన్నత విద్యా శాఖలో 742, బీసీ వెల్ఫేర్ 307, హోం శాఖ 133, పంచాయతీ రాజ్ 1245, రెవెన్యూ శాఖ 2,077 పోస్టులున్నాయి.
ఇది కూడా చదవండి….కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)లొో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్