అదను దాటలేదు, ఆందోళన చెందవద్దు
వానాకాలం లో వాతావరణ మార్పులకు అనుకూలంగా వివిధ పంటలలో సాగు విధానం.
డా. ఎన్ వెంకటేశ్వర్ రావు సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్. కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట.
జమ్మికుంట, జూన్ 29 (నిజం చెపుతాం)
మారుతున్న కాలం తో వాతావరణ పరిస్థితులల్లో వివిధ మార్పులు సంభవించి -కాలనుగునంగా వర్షాలు పడకుండా ఆలస్యం అవడంతో రైతులు ఆందోళన చెందవద్దు అని డా. ఎన్ వెంకటేశ్వర్ రావు అన్నారు.
కాని వివిధ పంటలను విత్తుకోవడానికి సమయం దాటిపోలేదు. కాబట్టి రైతులు ఆందోళన చెందవలసిన అవసరము లేదు. జూలై నెలలో వచ్చే వర్షాల ఆధారంగా వివిధ పంటలలో ఏ ఏ రకాలను ఎంచుకోవాలి, ఎలాంటి పద్ధతులను పాటించాలో పంటల వారిగా సూచనలు ఇవ్వడం జరుగుతుంది.
.ఇలా ఋతుపవనాలు ఆలస్యంగా ఉన్నప్పుడు పంటలు ఎంపిక కీలకం. తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవాలి.
.10 నుండి 15 శాతం ఎక్కువ. విత్తనాలను వేసుకోవాలి.
.నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను బెట్ట పరిస్థితులను తట్టుకునే పంట రకాలను వేసుకోవాలి.
.అంతర పంటలు లేదా మిశ్రమ పంటలను వేసుకోవాలి.
.అంతర పంటలలో ధాన్యపు వంటలకు బదులు ఎప్పుదినుసులు లేదా నూనెగింజల పంటలను వేసుకోవాలి.
.సోయాచిక్కుడు మరియు ప్రత్తి ‘పంటలను తేలికపాటి నెలల్లో వర్షాధారపు పంటలుగా విత్తుకోకూడదు.
.భారత వాతావరణ విభాగం వారు అందజేసిన ముందస్తు వాతావరణ సూచనలను రైతులను పాటిస్తూ పంటలను వేసుకోవాలి.
వరి :
– వరి లో దీర్ఘ కాలిక రకాలకు (140-150 రోజులు) నార్లు పోసుకోకూడదు .
– వరి నార్లు పోయడానికి మధ్యకాలిక రకాలకి (130-135 రోజులు) 10 జూలై వరకీ, స్వల్ప కాలిక
రకాలకి(120-125 రోజులు) జూలై చివరి వరకు వరి నార్లు పోసుకోవచ్చును.
-నేరుగా విత్తు పద్ధతులపై (దమ్ము చేసి లేదా దమ్ము చేయకుండా సీడ్ కంమ్ పెర్టి డ్రిల్ ) రైతాంగం శ్రద్ద వహించాలి.
పత్తి:
– జూలై 20 వ తేదీ వరకు విత్తుకోవచ్చు..
– తేలిక నేలల్లో 50-60 మి.మీ., బరువు నేలల్లో 60-75 మి.మీ. వర్షపాతము నమోదు అయిన తర్వాత మాత్రమే ప్రత్తిని విత్తుకోవాలి. లేదా నేల 15 సెంటీ మీటర్ల లోతు వరకు తడిసిన తర్వాత మంచి తేమలో ప్రత్తిని విత్తుకొంటే, భూమిలో వేడి తగ్గి, మొలక శాతం బాగుంటుంది. న్యూమాంటిక్ ప్లాంటర్ యంత్రం ద్వారా అధిక సాంద్రత పద్ధతిలో 90×15 సెంటీమీటర్ దూరంలో విత్తకోవచ్చును (74,074 మొక్కలు/ హెక్టార్ కి).
– ప్రత్తిలో అంతర పంటగా కంది మంచి లాభాలు ఇస్తుంది. కాబట్టి అంతర పంటల సాగు చేపట్టాలి..
కంది పంట:
.కంది పంటను పెసర, మినుము, వేరుశనగ, ప్రత్తి, ఆముదము మరియు ఇతర పంటలతో అందర పంటగా విత్తుకోవచ్చు.
• సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఆగష్టు 15 వరకు కందిని విత్తుకోవచ్చని రైతాంగం గుర్తుంచుకోవాలి.
సోయాచిక్కుడు:
జూన్ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి జులై మొదటి వారము వరకు కూడా సోయాలో మంచి దిగుబడులు సాధించవచ్చు.
మొక్కజొన్న:
.జూలై 15 వరకు మొక్కజొన్నను విత్తుకోవచ్చు.
. నీటి ఎద్దడిని మొక్కజొన్న తట్టుకోలేదు. కాబట్టి, బోది మరియు సాళ్ళ పద్ధతి ఆచరించడం ద్వారా పంటకు ఎక్కువ కాలం తేమ అందుబాటులో ఉంచవచ్చు.
పెసర, మినుము:
.జూలై 15 వరకు విత్తుకోదగ్గ పంటలు
.సరైన మొక్కల సంఖ్యను పాటించడం ద్వారా ఆశించిన దిగుబడులు పొందవచ్చు.
.ఇతర ఆరుతడి పంటలైన ఆముదాలు, ప్రొద్దుతిరుగుడు, ఉలువలు జూలై 31 వరకు రైతాంగం సాగు చేసుకోవచ్చు.