Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సచివాలయ సిబ్బంది పై జిల్లా జాయింట్ కలెక్టర్ ఆగ్రహం

ఉండి, నిజం న్యూస్

ఉండి మండలం ఉండి- 1 సచివాలయ సిబ్బంది పై జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. రామ్ సుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మండలంలో పలు సచివాలయలయాలను సందర్శించి సిబ్బంది పనితీరును పరిశీలించారు.

ఉండి1 సచివాలయంలో సిబ్బంది పనివేళల్లో అందుబాటులో లేక పోవడంతో జాయింట్ కలెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనివేళల్లో కార్యాలయంలో లేని సిబ్బంది పై , విధులు సక్రమంగా నిర్వహించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

అనంతరం ఎస్ఆర్పీ అగ్రహారం సచివాలయాన్ని తణిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక ను, ఆధార్ సెంటర్ ను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి పూర్తి సహకారం అందించాలని సూచించారు.

అనంతరం ఉండి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. రీ సర్వే జరుగుతున్న గ్రామాల వివరాలను ఇంచార్జి తహసీల్దార్ ఎస్. వి. ఎస్ నాయుడు ను అడిగి తెలుసుకున్నారు.

ఎలాంటి వివాదాలకు తావులేకుండా సర్వే నిర్వహించాలని సిబ్బంది కి జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శిలు సిబ్బంది పాల్గొన్నారు.