Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బావి లో పడి యువకుడు…

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

మరిపెడ, జూన్ 28 నిజం న్యూస్

పశువులు మేపుకుంటూ వెళ్లిన యువకుడు ప్రమదవశాత్తుబావిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లచ్చ తండాలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చ తండ గ్రామపంచాయతీ పరిధిలోని అమరియా తండా కు చెందిన గుగులోతు వీరన్న నాగమణిల కుమారుడు గుగులోతు శేఖర్ (20 ) బుధవారం ఉదయం పశువులను మేత కోసం తీసుకుని వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి చేరక పోవటంతో అనుమానం కలిగిన కుటుంబసభ్యులు గాలించటం ప్రారంభించారు. ఈ క్రమంలో ధర్మారం ఊరకుంటలోని ఓ వ్యక్తి వ్యవసాయ బావిలో విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.