దేవీలాల్, విజయ్ తేజ లకు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు…

జూలురుపాడు,
మండల పరిధిలోని పడమట నర్సాపురం” శ్రీ వెలగ కోటయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మూడు దేవీలాల్ కు, కాకర్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థి గోగుల విజయ తేజ లు, బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల నందు సీటు సాధించారు. వీరు 2019 2020 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 10జిపిఏ సాధించారు. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన మూడు దేవిలాల్, కాకర్ల గ్రామానికి చెందిన గోగుల విజయ తేజ, మంచి పేరు పొందిన బాసర ట్రిపుల్ ఐ టి కళాశాలలో సీటు సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గాప్రసాద్, బాలాజీ,లు అభినందనలు తెలిపారు. వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం, పలువురు, అభినందనలు తెలియజేశారు .