మంచినీటి బావి ఆక్రమణ ఫిర్యాదు..డిపీవో విచారణ
పాలకోడేరు. నిజం న్యూస్ మండలం పొన్నాడ గ్రామంలో పంచాయతీ కి చెందిన మంచినీటి బావి ఆక్రమణకు గురైందని జిల్లా అధికారులకు ఫిర్యాదు అందింది.
దీంతో స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి జీ. వీ. కె మల్లికార్జునరావు పొన్నాడ గ్రామంలో విచారణ చేపట్టారు. మంచినీటి బావి పంచాయతీ కీ చెందిందని అయితే ఆ బావి ని ఆక్రమించుకున్నారని కొందరు డి. పీ. ఓ తెలియ చేశారు.
ఆ. బావి ఉన్న ప్రాంతాన్ని వెంటనే సర్వై చేసి నివేదిక ఇవ్వాలని సర్వే సిబ్బందిని డి. పీ ఓ ఆదేశించారు.
సర్వే నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే గ్రామంలో ఉన్న నాన్ లేఅవుట్ లను పరిశీలించి నోటీస్ బోర్డు లు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు సూచించారు.
డీ. పీ. ఓ వెంట ఇంచార్జి ఈ. ఓ. పీ. ఆర్డీ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.