పెట్రోల్ బంకుల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ బ్యూరో జూన్ 28 నిజం న్యూస్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.
ఈ మేరకు పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సంబంధించి గుర్తించిన స్థలాలను నోటిఫై చేస్తూ ప్రకటన జారీ అయింది. ఈ ప్రకటనలోని స్థలాల్లో అర్హత, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించాయి.
ఇది కూడా చదవండి…గ్యాస్ కావాలా.. వాట్సప్ చేస్తే చాలు
రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సేవల్ని చేరువ చేసేందుకు గ్రామీణ ప్రాంతాలు, కొత్త రహదారుల్లోనూ మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు హెచ్‌పీసీఎల్ డిప్యూటీ జీఎం(రిటైల్) జేఎం నాయక్ తెలిపారు. పూర్తి వివరాలు www.petrolpumpdealerchayan.in వెబ్‌సైట్‌లో పొందు పరిచామని తెలిపారు.