గ్యాస్ కావాలా.. వాట్సప్ చేస్తే చాలు
మహబూబాబాద్ బ్యూరో జూన్ 28 నిజం న్యూస్
హైదరాబాద్: కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ చేస్తున్నారా..? ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారా..? ఇక ఆ ప్రయాస అవసరం లేదు. వాట్సాప్‌లో ఆప్షన్ ఎంపిక చేసుకుంటే చాలు కొత్త కనెక్షన్ సులభంగా పొందొచ్చు.
వినియోగదారుల కోసం వాట్సాప్ సేవలు తీసుకొచ్చినా వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
ఆయిల్ కంపెనీల వాట్సాప్ నంబర్లతో వినియోగదారులు క్షణాల్లో బుకింగ్, రీఫిల్లింగ్, ఇతర సేవలను వినియోగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి…ఖర్జూర తింటే అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం…
ఉదాహరణకు మీరు హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులైతే.. ఆ సంస్థ వాట్సాప్ నంబరు 92222 01122లో బీi అని టైప్‌చేసి పంపగానే వచ్చే మెనూ ఆధారంగా అన్నిరకాల సేవలు పొందొచ్చు.
‘సువిధ’ ఎంపికలో కొత్త కనెక్షన్, కనెక్షన్ తొలగింపు తదితర సేవలను పొందొచ్చు.
హెచ్‌పీ కంపెనీ సేవలకు 92222 01122
ఇండేన్ కంపెనీ సేవలకు 75888 88824
భారత్ గ్యాస్‌కు 18002 24344