Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఖర్జూర తింటే అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం…

 

ఒక అధ్యయనం ప్రకారం, ఖర్జూరంలో సెలీనియం, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, కాపర్‌, మెగ్నీషియంతో సహా 15 మినరల్స్‌ ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌ కణాలతో పోరాడతాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఖర్జూరంలో 23 అమైనో యాసిడ్స్‌, పాల్మిటోలిక్‌, ఒలీక్, లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్‌‌‌‌ వంటి అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. ఖర్జూరం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి..

ఖర్జూర వల్ల ఉపయోగాలు
నిగనిగ మెరిసిపోతూ..

ఖర్జూరాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి టిస్ట్‌లోనూ మధురంగా ఉంటాయి. అందుకే అందరూ దీన్ని ఎంతో ఇష్టపడతారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషదాల తయారీలోనూ ఉపయోగిస్తారు. రోజూ తక్కువ మొత్తంలో ఖర్జూరం పండ్లు తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం, ఖర్జూరంలో సెలీనియం, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, కాపర్‌, మెగ్నీషియంతో సహా 15 మినరల్స్‌ ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌ కణాలతో పోరాడతాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఖర్జూరంలో 23 అమైనో యాసిడ్స్‌, పాల్మిటోలిక్‌, ఒలీక్, లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్‌ వంటి అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. ఖర్జూరంలోని పోషకాలను పొందాలంటే.. రోజుకు 3 ఖర్జూరాలు మాత్రం తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి రిజల్ట్స్‌ కోసం వారం పాటు క్రమం తప్పకుండా తినాలని అంటున్నారు. ఖర్జూరం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి..

ఖర్జూర తింటే గుండెకు మంచిది….
ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఖర్జూరం తినటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గుండెపోటు, హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఖర్జూలంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్‌ బీట్, బీపీను నార్మల్‌గా ఉంచుతుంది. గుండె సంబంధిత ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే.. పొటాషియం, ఫాస్ఫరస్‌ , సెలీనియం, కాపర్‌, మాంగనీస్ వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముకల సమస్యలు రాకుండా రక్షిస్తాయి. ఉంఖర్జూరంలో విటమిన్-కె కూడా పుష్కలంగా టుంది, ఇది రక్తం గట్టిపడటానికి, ఎముకల జీవక్రియలో సహాయపడుతుంది..
ఖర్జూర తింటే జీర్ణ సమస్యలు దూరం….
ఖర్జూరంలో నీటిలో కరిగే, కరగని.. రెండు రకాల ఫైబర్ ఉంటుంది. జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి, మలబద్ధకం దరిజేరకుండా ఉండటానికి తోడ్పడుతుంది. ఇలా పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పునూ తగ్గిస్తుంది. తిన్న ఆహారం సరిగా ఒంట పట్టటానికి తోడ్పడే జీర్ణ రసాలు ఉత్పత్తయ్యేలానూ ఖర్జూరం ప్రేరేపిస్తుంది.