రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు
ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సాహాలు
పటాన్ చెరు జూన్ 27(నిజం చెబుదాం)
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పాశంమైలారం గ్రామం మంగళవారం ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సాహాలు జరిపారు, ఆషాఢ బోనాల పండగ అంటే గ్రామదేవత అమ్మవారుని పూజించే పండుగ.
భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం.దీన్ని ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నుల పండువగా నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి….OMR షీట్ పై వేలిముద్ర వేయటం మర్చిపోవద్దు
వేటపోతు మెడలో వేపమండలుకట్టివ్యాధి నిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం
మరియు అమ్మవారి కళ్యాణ మహోత్సవము,అన్నదాన కార్యక్రమము,బోనాలు, బండ్లు, యాటలు తీయుట,రేణుక ఎల్లమ్మ ఒగ్గు కథ భక్తులందరూ పెద్ద ఎత్తున బోనాలతో అంగరంగ వైభవంగా జాతరలో భక్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సర్పంచ్ కృష్ణ యాదవ్,గోపాల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అభిలాష్ రెడ్డి ,సతీష్ రెడ్డి ,రాజిరెడ్డి, మోహన్ రెడ్డి ,రామ్ రెడ్డి ,శ్రీకాంత్ రెడ్డి ,లక్ష్మారెడ్డి మరియు గుడి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.