Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

OMR షీట్ పై వేలిముద్ర వేయటం మర్చిపోవద్దు

జిల్లా కలెక్టర్ కె ,శశాంక.
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూన్ 26, (నిజం న్యూస్):
గ్రూపు- 4 పరీక్షలు వ్రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రంలో పరీక్ష ముగిసే ముందుగా ఓఎంఆర్ షీట్ పై వేలిముద్ర వేయటం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరాదని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు .

కలెక్టరేట్లోని ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జులై ఒకటో తారీకు న నిర్వహించబోయే గ్రూపు- 4 పరీక్షల కు హాజరవుతున్న యువతకు ప్రత్యేక సూచనలు చేశారు.

గ్రూపు -4 పరీక్షలకు జిల్లాలో 14 207 అభ్యర్థులు పరీక్షలు వ్రాయుచున్నందున 46 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8 గంటల నుండి 8.30 వరకే పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలన్నారు

ఇది కూడా చదవండి…ఒక్క వర్షానికే కుంగిపోయిన కరకట్ట రాళ్లు

ఉదయం 10 గంటలకు గ్రూప్-4 పరీక్ష ప్రారంభం కానున్నందున యువత సకాలంలో చేరుకోవాలని ఉదయం 9.45 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలలోనికిఅనుమతిస్తామన్నారు. అదే విధంగా మధ్యహన్నాం 1 గంట నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రూప్-4 పరీక్ష అభ్యర్థులను మధ్యాహ్నం 2.15 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రం లోనికి అనుమతి ఇస్తామన్నారు.

పరీక్షా కేంద్రాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించాలని, త్రాగునీటి వసతి కల్పించాలని, నిరంతరంగా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అభ్యర్థులు బూట్లు వేసుకొని పరీక్షా కేంద్రాల లోనికి రాకూడదని, సెల్ ఫోన్ లకు అనుమతి లేదన్నారు.

పరీక్షల నిర్వహణ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని అధికారులనుఅదేశించామన్నారు.

పరీక్షా కేంద్రంలో బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గ్రూప్-4 పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి అవగాహన కార్యక్రమం కూడా చేపట్టినట్లు కలెక్టర్ తెలియజేశారు.