Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒక్క వర్షానికే కుంగిపోయిన కరకట్ట రాళ్లు

పొంచి ఉన్న పెను ప్రమాదం.
ఏటూరునాగారం జూన్ 27 నిజం చెపుతాం న్యూస్:

అసలే గోదావరి ముంపు ప్రాంతం, అనుకోని ఉన్న గ్రామం, వర్షాకాలం వచ్చిందంటే అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యేది,అందరికి వినపడే ఊరు పేరే రామన్నగూడెం గోదావరి పరివాహక ప్రాంతం అయిన గ్రామానికి అనుకోని గోదావరి ప్రవహిస్తుంది.రక్షణ కావచం గా గ్రామం చుట్టూ కరకట్టను పోశారు.

అయితే వర్షాకాలంలో గోదావారి ఉప్పొంగి ఏటూరునాగారం ,రామన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న గొంటోర్యా మూలమలుపు వద్ద వరద ప్రవాహ కోతకు గురై కరకట్ట తెగిపలి బీటలు బాసింది.

ఇది కూడా చదవండి….మా యుద్ధంలో న్యాయం ఉంది.. తప్పక గెలుస్తాం

ఇర్రిగేషన్ అధికారులు సర్వే చేసి కరకట్టను రివీటిమెంట్ లాగా రాళ్లను అమర్చి కోతకు గురి కాకుండా రక్షణ వలయంగా ఏర్పాటు చెయ్యగా రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కరకట్ట రాళ్లు కుంగిపోయి మళ్ళీ మొదటికి వచ్చింది.

దీంతో ముంపు ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుబిక్కుమంటూ వరద వస్తే ప్రాణ,ఆస్తి నష్టమే కాకుండా అన్ని విధాలుగా ఇబ్బంది ఎదుర్కొనే సమస్య వస్తుందని. ప్రభుత్వం, సంబంధిత అధికారులు తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కరంగా కరకట్టను నాణ్యమైన ఆయాకట్టను నిర్మించి సిమెంట్ తో రివీటిమెంట్ వేయాలని కోరుతున్నారు.