Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మా యుద్ధంలో న్యాయం ఉంది.. తప్పక గెలుస్తాం

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయిందని.. 75 ఏళ్ల తర్వాత భారత్‌ అభివృద్ధి ఎలా ఉందో ఆలోచించాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే భారత్‌ సరికొత్త పంథాలో నడవాల్సి ఉందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని సర్కోలిలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అతి తక్కువ కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్‌, రైతుబంధు కింద ఏటా రూ.10 వేల పెట్టుబడి సాయం, అన్నదాతలు మరణిస్తే రూ.5 లక్షల బీమా ప్రభుత్వమే అందిస్తోందని వివరించారు.

తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు కాదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కేసీఆర్‌కు ఏం పని అని ఫడణవీస్‌ విమర్శిస్తున్నారని.. తాను భారతదేశ వాసినని, ఎక్కడికైనా వెళ్లి పని చేయగలనని తెలిపారు. మహారాష్ట్రలో తెలంగాణ అజెండా అమలు చేస్తే.. తాను వెనక్కి వెళ్తానని స్పష్టం చేశారు.

Also read: వరల్డ్ కప్ లో ఇండియా ఆడే మ్యాచ్ లు ఎప్పుడెప్పుడంతే

*పండరీపుర్‌ విఠల్‌ రుక్మిణీ ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు*

ఈ క్రమంలోనే బీజేపీకి బీఆర్‌ఎస్‌ ఏ టీమ్‌గా పని చేస్తుందని కొందరు విమర్శిస్తున్నారని.. తమ పార్టీ ఏ పార్టీకి ఏ, బీ టీమ్‌గా ఉండదన్నారు. బీఆర్‌ఎస్‌.. రైతులు, బలహీనవర్గాల టీమ్‌గా ఉంటుందని వివరించారు. బీఆర్‌ఎస్‌ రైతుల పక్షాన మాత్రమే నిలుస్తుందని తెలిపారు.

అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ముందుకెళ్తున్నామన్న ఆయన.. రైతులు ఏకతాటిపైకి వచ్చేవరకు సమస్యలు అలాగే ఉంటాయన్నారు. ఎన్నికల్లో పార్టీలు గెలవడం కాదు.. ప్రజలు గెలవాలని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

రైతు ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. తాము చేస్తున్న యుద్ధంలో న్యాయం ఉన్నందున కచ్చితంగా గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

”మహారాష్ట్రలో కేసీఆర్‌కు ఏం పని అని ఫడణవీస్‌ విమర్శిస్తున్నారు. నేను భారతదేశ వాసిని ఎక్కడికైనా వెళ్లి పని చేయగలను. మహారాష్ట్రలో తెలంగాణ అజెండా అమలు చేస్తే నేను వెనక్కి వెళ్తా.

తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ఏర్పడిన అతి తక్కువ సమయంలో తెలంగాణ అభివృద్ధి సాధించింది. తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు. అన్ని వనరులు ఉన్న మహారాష్ట్ర ఇంకెంత అభివృద్ధి చెందాలి.” – *సీఎం కేసీఆర్‌*

నేడు మహారాష్ట్రలో బిజీబిజీగా సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇదే

డిజిటల్‌ ఇండియా.. మేకిన్‌ ఇండియా అని కొందరు గొప్పలు చెబుతున్నారని కేసీఆర్ విమర్శించారు. కానీ చాలాచోట్ల చైనా బజార్లు దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. భారత్‌ బజార్లు ఎక్కడికి పోయాయని నిలదీశారు.

ఈ క్రమంలోనే తాను రైతు బిడ్డను అయినందునే వారి బాధలు తెలుసన్న ఆయన.. తెలంగాణలో ధరణి పోర్టల్‌ ద్వారా భూమి మార్పిడి హక్కులు రైతులకే ఇచ్చామన్నారు.

రైతులు స్వతహాగా మార్చుకుంటేనే భూములు మారతాయని.. సీఎంతో పాటు నాయకులు, అధికారులెవరూ భూములను మార్చలేరన్నారు. తాము చేస్తున్న యుద్ధంలో న్యాయం ఉన్నందున కచ్చితంగా గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.