భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద మూడు లక్షల విలువగల గంజాయి లభ్యం

భద్రాచలం A.S.P శ్రీ.రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భద్రాచలం కూనవరం రోడ్ లోని I.T.C క్వార్టర్స్ దగ్గరలో పట్టణ సిఐ స్వామి ఆద్వర్యంలో, ఎస్.ఐ B. మహేష్ తన సిబ్బందితో వాహన తనిఖీ లు చేస్తుండగా AP 05 AP 3999 అనే నెంబర్ గల కారు కూనవరం రోడ్ నుండి భద్రాచలం వైపు వస్తుండగా కారును ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించినారు. ఈ తనిఖీల్లో కారు నందు 20.00కేజీల గంజాయి లభ్యమైంది. దీని విలువ 3, 00000 /- రూపాయలు గా ఉండును. ఇందులో ఉన్న ముద్దాయిలను విచారించగా విశాఖపట్నం కు చెందిన 01. కుర్ర సుధా అలియాస్ సుధాకర్ , 02. మజ్జి అర్జున్, 03. కొర్ర ధనుంజయ్, మహబూబాబాద్ కు చెందిన 04. వాంకుడోత్ సూక్య అని చెప్పినారు. వీరు ఈ గంజాయిని సీలేరు నుండి మహబూబాబాద్ తీసుకు వెళ్తున్నారని చెప్పినారు. భద్రాచలం పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటైయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి మరియు మారేయితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి.స్వామి, ఎస్. ఐ., B. మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..