Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ (FCRI) (A’ గ్రేడ్ తో ICAR & ICFRE చే గుర్తింపు పొందింది) శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ అనుబంధ కళాశాల)

బి.ఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ ప్రవేశ ప్రకటన 2023),

అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ (FCRI) విద్యా సంవత్సరము 2023-24 నకు బి.ఎస్సీ. (ఆనర్స్) ఫారెస్ట్రీ నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్స్ లో ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పద్దతి: అడ్మిషన్లు జీవశాస్త్రం ఫ్రీమ్- 75% సీట్లు / గణిత ఫ్రీమ్ 25% సీట్లు) TS EAMCET- 2023

ర్యాంక్తో PCB/PCM/PCMB సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/10+2 లేదా తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తించబడిన ఏదైనా ఇతర సమానమైన పరీక్ష ఆధారంగా ఉంటాయి. ప్రవేశ ఎంపికలో రిజర్వేషన్ లు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి పాటింపబడును.

దరఖాస్తు చేయు విధానము: తేది: 14-06-2023 నుండి సూచించిన ధరఖాస్తు ఫారం కళాశాల వెబ్ సైట్ www.fcrits.in లో నింపి దరఖాస్తు ఫారమునకు కావలసిన సర్టిఫికేట్ కాపీలు అప్లోడ్ చేయవలెను

మరియు దరఖాస్తు రుసుమును ఆన్ లైన్ లో రూ. 1000/- SC / ST / PH అభ్యర్థులకు మరియు ఇతరులకు రూ.2000/- చెల్లించవలెను.

ఆలస్య రుసుము లేకుండా 12-07-2023 సాయంత్రం 05:00 గంటలలోపు లేదా 15-07-2023 ఆలస్య రుసుముతో రూ. 500/- ఆన్లైన్లో దరఖాస్తు చేయవలెను.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.fcrits.in చూడండి. లేదా హెల్ప్ లైన్ నంబర్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నెంబర్: 8074350866-8919477851, ఈమెయిల్: [email protected]