కల్తీ పాలు గుట్టు రట్టు
నిజం న్యూస్. లింగలపాలెం.
కల్తీ పాలు గుట్టు రట్టు చేశారు లింగపాలెం పోలీసులు. ఏలూరు జిల్లా లింగలపాలెం మండలం మల్లేశ్వరం గ్రామంలో జయరాం అనే వ్యక్తి పాల కేంద్రం నడుపుతూ కల్తీ పాలను తయారుచేసి అమ్మకాలు సాగిస్తున్నాడు.
ఆయన దగ్గర పాలు వాడుతున్న వారు అనారోగ్యం బారిన పడుతుండడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో స్పందించిన సి. ఐ మల్లేశ్వరావు నిఘా పెట్టారు. జయరాం నడుపుతున్న పాలకేంద్రాన్ని, అక్కడ ఆటోలలో తణికీలు చేబట్టి నకిలీ పాల గుట్టు రట్టు చేశారు. పాలపౌడర్ లో కొంత క్రీమ్ కలిపి పాలల్లో కలుతున్నాడు.
దీంతోఎంత నీరు కలిపిన ఏ మాత్రం చిక్కదనం తగ్గదు. ఈ విధంగా వంద లీటర్ల పాలను రెండొందల లీటర్ల నకిలీ పాలను తయారు చేస్తూ మోసానికి పాల్పడుతున్న జయరాం ను పోలీసులు అరెస్టు చేశారు.