Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పండు ఒక్కటే కానీ… ఫలితాలు ఎన్నో

చైనీస్ గూస్బెర్రీస్ అని పిలుబడే కివీ పండ్లు చూడటానికి ముదురు గోధుమ రంగు జూలుతో కోడి గుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక గింజలతో నిండిన ఆకు పచ్చని లేదా పసుపు పచ్చని గుజ్జు కలిగివుంటుంది. ఈ మధ్య భారతీయ మార్కెట్లలో యాపిల్ పండంత ఖరీదులో లభిస్తున్నాయి. కమలాలకు రెట్టింపు ‘విటమిన్‌ సి’, ఆపిల్‌లో కన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ దీని సొంతం.

ఆ ఐదు పోషక విలువలు ఏంటో చూద్దాం…

పీచు పదార్థం, విటమిన్‌ ఇ, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, కెరోటినాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం ‘కివీ’ పండు.

ఈ పండ్లు ఎక్కడ పండుతాయో తెలుసా?..

న్యూజిలాండ్‌లో మాత్రమే పండే కివీలు ఇప్పుడు మన మార్కెట్‌లోనూ విరివిగా దొరుకుతున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గించుకోవాలనుకునేవారి కివి పండు సహాయపడుతుంది.

కివి పండు తింటే ఆ వ్యాధులు అదుపులో ఉంటాయి..

కివి పండులో యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలవల్ల బీపీ, కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు, నోరూరించే రుచి కూడా కివీ సొంతం.

 

కివిపండులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి . కివి పండ్లను అనేక ప్రాంతాలలో పండిస్తారు, అండాకారంలో ఉంటుంది . సుమారు 5.8 పొడవు 2.0 సెం.మీ. వెడల్పు, 5.5 సెం.మీ. ఎత్తు కలిగి మెత్తగా ఉంటుంది . మంచి సువాసన కలిగి ఉంటుంది . దీనిని వ్యాపార పండుగా అనేక దేశాలలో పండిస్తున్నారు . చైనాలో దీనిని ‘గూస్ బెర్రీ ‘ పండుగా వాడుకలో ఉన్నది .

కివి పండుకు పేర్లు చాలా ఉన్నాయి.

దీనిని వండర్ ఫ్రూట్ అని పిలవటం కూడా వింటూంటాం. ఇంతటి ఆశ్చర్య ఫలితాలనిచ్చే ఈపండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పండ్లు అన్నిటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివి పండు పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. సాధారణంగా మనం తినే 27 రకాల పండ్లలో కివి పండులో అధిక పోషకాలు ఉంటాయి.