Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

40.5 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

నకిలి విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్టు

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

గుండెపుడిలో 40.5కేజీల పత్తివిత్తనాలు పట్టివేత

ఇద్దరిపై కేసు, పరారీలో ఓ నిందితుడు

వివరాలు వెల్లడించిన తొర్రుర్ డీఎస్పీ ఏ. రఘు

మరిపెడ, జూన్ 26 (నిజం న్యూస్):

మహబూబాబాద్ జిల్లా మరిపెడ నకిలి విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్టు ప్రయోగిస్తామని, రైతులు వ్యవసాయాధికారులు సూచించిన అనుమతి పొందిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని తొర్రుర్ డీఎస్పీ ఏ.రఘు అన్నారు. మరిపెడ మండలంలోని గుండెపుడిలో నిషేధిత విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రఘు మరిపెడ పీఎస్ లో వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ పవన్ కూమార్ గుండెపుడి గ్రామ శివారు లో రేఖ సురేష్ వ్యవసాయ క్షేత్రం వద్ద తనిఖీ నిర్వహించగా రెండు బస్తాలలో 90 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్స్ ఉన్నట్లు గుర్తించారు.

పట్టుబడిన విత్తనాలు 40.5కేజీలుండగా ఇది ప్రభుత్వం నిషేదించిన బీటీ-3 గా వ్యవసాయశాఖ అధికారులు నిర్ధారణ చేశారన్నారు. వీటి విలువ సుమారు రూ.1.35లక్షలు ఉంటుందని వాటిని స్వాధీనం చేసుకుని మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన రేఖ సురేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివకుమార్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కాగా శివకుమార్ పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ విత్తనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మక్కపేట వద్ద కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసిందన్నారు.

నకిలి విత్తనాలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ దూలం పవన్ కుమార్, కే క్రాంతి కుమార్, డ్రైవర్ సందీప్ లను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ ఎన్ సాగర్, వ్యవసాయ అధికారి వీరాసింగ్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.