Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వర్షాకాలం వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

వర్షాకాలం జాగ్రత్త...

వర్షాకాలం జాగ్రత్త.. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి….

సాధరణంగా వర్షాకాలంలో అనేక వ్యాధులు విజృంభిస్తాయి.

1.ఆ వ్యాధులు ఏంటో తెలుసుకుందాం….

డయేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, కామెర్ల వ్యాధులు ఎక్కువగా ప్రబులుతాయి మరి వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం…

2.వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

వర్షాకాలంలో అనేక వ్యాధులు వెంటాడుతాయి. ఈ సీజన్‌లో కొంచం అజాగ్రత్తగా వ్యవహరిస్తే రోగాల బారిన పడేందుకు ఎక్కువ సమయం పట్టదు. వర్షాకాలంలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు . ఈ వ్యాధులు దోమల ద్వారా వ్యాపిస్తాయి.

వ్యాధుల బారిన పడకుండా ఈ సీజన్‌లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, వర్షాకాలంలో వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

3.డెంగీ జ్వరం రావడానికి కారణాలు ఇవే….

డెంగ్యూ దోమలు మురికి ఉన్న ప్రదేశాలలో లేదా మురికి నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు.

ఇది భ్రమ, నిజానికి డెంగ్యూ దోమకు మురికితో సంబంధం లేదు. డెంగ్యూ ఏడిస్ దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధి. డెంగ్యూని వ్యాప్తి చేసే ఈ దోమలు ఇళ్లలో ఉంచిన పాత్రలు, కూలర్లు, ఏసీలలో ఉంచిన స్వచ్ఛమైన నీటిలో కూడా సంతానోత్పత్తి చేస్తాయి.

డెంగ్యూ, మలేరియా రావడానికి చాలా దోమలు కుట్టాల్సిన అవసరం లేదు. ఒక్క దోమ కుట్టిన చాలు డెంగ్యూ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఏడెస్ దోమ కాటు వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవడం మంచిది. ఎక్కుడ దోమలు కనిపించినా తేలిగ్గా తీసుకోకుండా వీలైనంత త్వరగా వాటిని చంపేయండి.

4.దోమల నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఇలా చేయండి…

డెంగ్యూ, మలేరియా రాకుండా ఉండాలంటే దోమలను నివారించడం చాలా ముఖ్యం. కాబట్టి, ఈ సీజన్‌లో ఉదయం లేదా సాయంత్రం అయినా పూర్తి చేతుల దుస్తులను ధరించండి. తద్వారా దోమలు కుట్టకుండా నివారించవచ్చు. ఇది కాకుండా, మోస్కాటో కాయిల్స్ మొదలైన నివారణ మార్గాలను ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల దోమల బెడద నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.