పెద్దపల్లి జిల్లాలో బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు
జమ్మికుంట, జూన్ 26 (నిజం చెపుతాం)
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో హైదరాబాద్ నుండి రామగుండం వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఉదయం ఆటోను తప్పించబోయి బస్సు బోల్తా పడింది.
ఈ ఘటనలో 20 మందికి తీవ్రగాయాలు కాగా.. మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108లో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.