Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కీబోర్డ్ మీద ఈ అక్షరాలు టైప్ చేస్తే ….టైపింగ్ లో వేగం పెరుగుతుంది

ఈ అక్షరాలు టైప్ చేస్తే టైపింగ్ వేగంగా వస్తుంది.

కీబోర్డ్ మీద వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా.

1.కీ బోర్డ్ మీద ఫాస్ట్‌గా టైప్ చేయాలనుకుంటున్నారా..మీరు ఎంత ట్రై చేసినా కీ బోర్డ్ మీద చేతులు ఫాస్ట్ గా వెళ్లడం లేదా..మీ బాస్ ఫాస్ట్‌గా టైప్ చేయమని ఫైల్స్ ఇస్తే మీరు చేయలేకపోతున్నారా.

2.అయితే మీకోసం కొన్ని చిట్కాలు ఇస్తున్నాం. వాటితో మీరు మీ టైపింగ్ స్పీడ్ వేగంగా పెంచుకునే అవకాశం ఉంది. మరి అవి ఎంతవరకు పనిచేస్తాయో ఓ సారి చెక్ చూసి చూడండి.
3.టైప్ ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యే ముందు మీరు కుదురుగా కూర్చోవాలి. అటు ఇటు ఒరగడం కాని లేకుంటే ఓ పక్కనుంచి టైప్ చేయడం కాని చేయకూడదు. మీ చేతి వేళ్లు కీ బోర్డ్ మీదనే ఉండాలి. మీరు ఎత్తును కూడా సరిచూసుకోవాల్సి ఉంటుంది.

4.ఈ పై రెండు సూచనలు పాటించిన తరువాత మీరు ఈ విధంగా చేయాలి. ముందుగా కీబోర్డ్ పై ‘F’ బటన్ దగ్గర మీ ఎడమ చేయి రెండో వేలును ఉంచి అలా వరుసగా ‘A’ బటన్ దాకా మిగతా వేళ్లను ఉంచండి. అలాగే కుడి పక్కన కూడా కుడి చేతి వేళ్లు ‘J’ దగ్గర నుంచి ‘L’ బటన్ దాకా పెట్టండి. చివరన తరవాత వీటిదగ్గర కుడిచేతి చిటికెన వేలు ఉంటుంది. స్పేస్ బార్ మీదకు రెండు చేతుల బొటన వేళ్లు ఉంచండి.
ఇక చిన్నగా టైపింగ్ స్టార్ట్ చేయండి. అలానే కీ బోర్డ్‌లో పైకి కిందకి ఉన్న లెటర్స్ మీదకు అవే వేళ్లు పోనివ్వండి. ఉదాహరణకు F బటన్ మీద ఉన్న వేలును R మీదకు D బటన్ మీద ఉన్న వేలును మీద ఉన్న వేలు E బటన్ మీదకు కూడా ప్రయత్నించండి.

5.అయితే ఈ కింద ఉన్న అక్షరాలను క్రమంగా టైప్ చేయడం వల్ల టైపింగ్ వేగవంతం అవుతుంది ఎక్స్పర్ట్ చెపుతున్నారు. ఈ క్రింది అక్షరాలు కీబోర్డ్ లో ఉన్న మొత్తం అక్షరాలు టచ్ అవుతాయి.

6.THE QUICK BROWN FOX JUMPS OVER THE LAZY DOG…
చూడకుండా టైప్ చేయడమనేది చాలా కష్టమైన పని. అయితే చేస్తూ పోతుంటే ఏదైనా సాధ్యమే. మీరు కూడా నిదానంగా ప్రయత్నించి చూడండి. మీకు సాధ్యమవుతుంది….