Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హస్తినలో రాష్ట్ర బి జె పి నేతలతో అధిష్టానం కీలక సమావేశం

ఈ సంవత్సరం అక్టోబరు- నవంబరు మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న సంకేతాలు వెలువడిన నేపధ్యంలో తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ తాజాగా దృష్టి సారించింది. అధికారమే లక్ష్యంగా వ్యాహ రచన చేయాలని అధిష్టానం నిర్ణయించింది.

పార్టీ రాష్ట్ర విభాగంలో లో నెలకొన్న తాజా పరిణామాలపై అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా రాష్ట్ర నేతలతో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలు, అసంతృప్తితో వున్నట్లుగా తెల్స్తున్న ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ఢిల్లీ రావాలని అధిష్టానం ఆదేశించింది.

తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి కూడా ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా వచ్చే మూడు నెలలలో ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పజెప్పాలి,

ఎన్నికలకు ఎలా సమాయుత్తం అవ్వాలన్న అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ కాస్త డీలా పడినట్లుగా కనిపిస్తోంది.బండి సంజయ్ తప్పితే బి జె పి రాష్ట్ర కీలకనేతలెవ్వరూ ఉత్సాహంగా ప్రజా కార్యక్రమాలు, నిర్వహించిన దాఖలాలు లేవు.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించి అసంతృప్త నేతలను బుజ్జగించే పనిపై బీజేపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని నిర్ణయించింది.

ఇక పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ తోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోపాటు ఇతర సీనియర్ నేతలను కూడా పిలిపించుకుని మాట్లాడాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది.

నాయకుల మధ్య బేధాభిప్రాయాలు లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ అధిష్టానం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది

మొత్తానికి పార్టీ వ్యవహారాలను ఒక క్రమపద్ధతిలో నడిపించేందుకే బి జె పి హై కమాండ్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కేవలం కొన్ని పార్టీ కార్యక్రమాల కోసమే కిషన్ రెడ్డిని ఢిల్లీకి పిలిచారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ.. అదేం కాదని టీబీజేపీని క్రమబద్ధీకరించి ఆ పార్టీ కేడర్లో జోష్ నింపేందుకే ఆ ముగ్గురినీ హస్తినకు పిలిచినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి