Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పత్రిక విలేకరులపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

చిన్నగూడూరు,నిజం చెపుతాం,జూన్ 24:

బీఆర్ఎస్ నాయకులు కక్షపూరితంగా ప్రజల కోసం పనిచేసే పత్రిక విలేకరులపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, జర్నలిస్టులు బోయిని నరేంద్ర, గంగాధర్ అనిల్,గుర్రం నరేష్,జినక శేఖర్ లు అన్నారు.

శనివారం చిన్నగూడూరు మండల కేంద్రంలో గాడిపెల్లి శ్రీశైలం,మురారి,రమేష్,(రవి) లను ప్రోత్సహిస్తూ స్థానిక బిఆర్ఎస్ నాయకులు మాపై అసత్య ఆరోపణలపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..జర్నలిస్టులపై కక్షతో గాడిపెల్లి శ్రీశైలం,మురారి,రమేష్,(రవి) లను ప్రోత్సహిస్తూ స్థానిక బిఆర్ఎస్ నాయకులు మాపై అసత్య ఆరోపణలు,నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మా ప్రతిష్టకు భంగం కలిగించటమే కాకుండా మమ్ములను ఎంతో మనోవేదనకు గురి చేసినందున వారిపై ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలకు పూనుకుంటూ ఒకవేళ మాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఒకవేళ నిరూపించకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.