ఘన వ్యర్ధాల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమం.
జిల్లా కలెక్టర్ & అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం లోని ఎంపీడీవో ఆఫీస్ లో ఘన వ్యర్ధాల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీడీవో శ్రీనివాసరావు, ఐటిసి బంగారు భవిష్యత్తు వాష్ ప్రోగ్రాం ట్రైనర్ దాసరి వెంకట రావు, కో ట్రైనర్ రాజకుమార్, ఘన వ్యర్ధాల నిర్వహణ కార్యక్రమం లో భాగంగా ట్రైనర్ ట్రైనింగ్ ఇస్తూ తడి చెత్తను ఆకుపచ్చ డబ్బాలో వేయాలని, పొడి చెత్తను నీలం రంగు డబ్బాల వేయాలని, అదే విధంగా తడి చెత్తను ఇంటి కాడే కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవాలి,పొడి చెత్తను హరిత రాయబారులకు అందజేయాలని తెలియపరిచారు ఈ కార్యక్రమానికి కార్యదర్శులు, సర్పంచులు, గ్రీన్ అంబడిసర్ తదితరులు పాల్గొన్నారు.