Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మరో 1827 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏ శాఖలో అంటే

తెలంగాణ ప్రభుత్వం మరో 1827 ఉద్యోగాల భర్తీకి తాజాగా అనుమతులు మంజూరు చేసింది.

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి  సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన ఈ ఖాళీలను భర్తీ చేయనుందన్నారు.

జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరిందన్నారు. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నామన్నారు.

ఇప్పటికే 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, వారిని టీచింగ్ ఆసుపత్రుల్లో నియమించామని తెలిపారు. ప్రస్తుతం 1827 మంది స్టాఫ్ నర్సులను భర్తీ చేసుకోబోతున్నామన్నారు.

దీంతో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. తాజా నియామకాలతో మరో 1827 మందికి ఉద్యోగావకాశం కలుగుతుందని వివరించారు.