Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ్రూప్-4 హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి ఇలా

ఈరోజు నుండి గ్రూప్ ఫోర్ హాల్ టికెట్లు

హైదరాబాద్: గ్రూప్-4 నియామక పరీక్ష హాల్ టికెట్లను శనివారం నుంచి జారీ చేయనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (TSPSC) వెల్లడించింది.

టీఎస్ పీఎస్సీ వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జులై 1న రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది.

హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి ఇలా…

మొదటగా టిఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ tspsc.gov.in కు వెళ్లాలి.

దానిలో know your hall ticket number అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.

తర్వాత సెలెక్ట్ నోటిఫికేషన్ అని ఉంటుంది. దానిలో మీరు ఏ జాబ్ కు అప్లై చేశారు దాన్ని టిక్ చేయాలి. తర్వాత టీఎస్పీఎస్ఐడిని , పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ డౌన్లోడ్ అవుతుంది.