పాపకు పాము కాటు…..అందుబాటులో లేని వైద్యుడు..?
నిరంతరం ఇదే పరిస్థితి కనపడటం విడ్డూరం
ఎమ్మెల్యే సొంత మండలంలో వైద్య సేవలు కరువు
డాక్టర్ లేరు! ప్రతి సారి ఇదే వరస
దమ్మపేట జూన్ 23 నిజం చెపుతం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండల కేంద్రానికి చెందిన నల్లబోతుల నాగార్జున కుమార్తె నల్లబోతుల దుర్గాభవాని వయస్సు 8 సంవత్సరాలు. ఈ పాపను గురువారం నాడు సాయంత్రం 6 గంటలకు పాముకాటుకు గురైంది
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రముకు తీసుకొని వెళ్ళగా అందుబాటులో లేని డాక్టర్లు ఈ విషయంపై సీపీఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర రావు విధులలో ఉన్న నర్సును ప్రశ్నించగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారని ఒక డాక్టరు వెళ్లిపోయారని మరియొక డాక్టరు వస్తారంటూ…. వస్తారంటూ….కాలయాపన చేశారు.
ఈ క్రమంలో సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర రావు గట్టిగా ప్రశ్నించగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనీ నర్సు పాముకాటు బాధితురాలుకు ప్రథమ చికిత్స చేసి యాంటీ స్నేక్ ఇంజక్షన్లు పాపను అబ్జర్వేషన్లో పెట్టడానికి అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గతంలో కూడా పాము కాటుకి గురై ఐదు నుంచి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై దమ్మపేట గ్రామస్తులు ఎమ్మెల్యే సొంత మండలం అయినప్పటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పట్టించుకునేవారు లేరని వాపోయారు.