Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ పాపం ఎవరిది…?

విద్యార్థినిల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం మధ్య నెలకొన్న తగాదాలు.

స్కూలు ఫీజు కట్టలేదని విద్యార్థినిలను స్కూల్ లోపలికి రానియ్యని వైనం.

జిల్లా డీఈవో పర్యవేక్షణ లోపంతోనే .. ప్రవేట్ పాఠశాల ఇస్తారాజ్యం

సూర్యాపేట ప్రతినిధి జూన్ 23 నిజం చెబుతాం న్యూస్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రీయల్(శాంతినగర్) ఏరియాలో గల *శ్రీ మారుతి విద్యానికేతన్ హైస్కూల్* లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు.ఫీజు కట్టలేదని స్కూల్ లోనికి రానీయకుండా గేటు వద్దనే యాజమాన్యం అడ్డుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

తెలిసిన వివరాల ప్రకారం,.ఎల్ కె జి చదువుతున్న చిన్నారి వాంకుడొతు సమృత ఇంటికి వెళ్లగా,ఉదయం నుండి స్కూల్ బయటే ఉన్న మరో విద్యార్థిని వాంకుడొతు వైష్ణవి,4వ తరగతి.స్కూల్ గేటు ముందు ఉన్న అరుగుపై కూర్చొని అన్నం తిన్న చిన్నారి. కావాలనే ఇద్దరు పేరెంట్స్ తమ స్కూల్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపల్ వివరణ.

జరిగిన సంఘటన పై సూర్యాపేట జిల్లా విద్యాధికారి పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఫీజుల విషయంలో ఇస్తారాజ్యంగా ప్రవర్తిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని వివిధ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి…