Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తుంగతుర్తి లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్న కేసీఆర్ ని రాబోయే ఎన్నికల్లో గద్దె దించుతాం .

తుంగతుర్తి జూన్ 22 నిజం చెబుతాం న్యూస్

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తూ స్వంత పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఇందుకు నిరసనగా *తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి ప్రధాన రహదారిపై *దశాబ్ది దగా* పేరుతో *కేసీఆర్ దిష్టి బొమ్మ* దగ్దం చేసారు

అనంతరం, నిరసన తెలియజేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను అన్నింటినీ ఎత్తిచూపుతూ, స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోక పోవడమే కాకుండా, వారి ఆశయాలను అణగదొక్కి, వారి త్యాగాల పునాదిపై అందలమెక్కి, తెలంగాణ రాష్ట్రాన్ని తమ స్వంత జాగీరుగా చేసుకొని దోచుకుంది కల్వకుంట్ల కుటుంబం..

వారి దోపిడీకి అడ్డుకట్ట వేసి, అమరుల ఆశయాలను నెరవేర్చే వరకు తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడ్తూనే ఉంటుంది అని వారు అన్నారు

అనంతరం ప్రధాన రహదారిపై ర్యాలీగా వెళ్లి స్థానిక తుంగతుర్తి ఎమ్మార్వో వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ గుడిపాటి నర్సయ్య. నియోజకవర్గ ఇన్చార్జ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బాల లక్ష్మి,

పిసిసి అధికార ప్రతినిధి అన్నేపర్తి జ్ఞాన్సుందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు దొంగారి గోవర్ధన్, వివిధ మండలాల అధ్యక్షులు నూతనకల్ నాగం సుధాకర్ రెడ్డి, అర్వపల్లి మారెపాక సత్యం, మండల ఉపాధ్యక్షులు మారగాని వెంకటయ్య, పెద్ద బోయిన అజయ్ కుమార్,ఇంచార్జ్ కొండా రాజు, కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, ఉప్పుల రాంబాబు, మాచర్ల అనిల్, రామారావు, బి ఎన్, సేవాదళ్ జిల్లా ఇన్చార్జ్ కాసర్ల గణేష్, చందు, మైనారిటీనాయకులు ఎండి అబ్దుల్, కరీం, ఓబిసి మండల అధ్యక్షులు రామచంద్రయ్య,

వెంకటేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.