జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ. సి.ఎం
చిత్రాడ నూకేష్ ఆంద్రప్రదేశ్ బ్యూరో
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని శుక్రవారం తాడేపల్లి లో ఏపీ. సి. ఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం జూలై ఒకటి నుంచి 30 రోజుల పాటు జరుగుతుందని, ఈ కార్యక్రమంద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రతీ గ్రామంలో రెండు అధికారుల బృందం పర్యటించి సమస్యలు పరిష్కరించడంలో నిమగ్నం అవుతారన్నారు.
ప్రతీ ఇంటి తలుపు తట్టి అధికారులు సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తారన్నారు. ఏ దృవీకరణ పత్రం కావాలన్నా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వెంటనే లభిస్తుందని సీ. ఎం. అన్నారు.
పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పదకాలు సేవలు తాము అందుస్తున్నామన్నారు.రాష్టంలో 15004 సచివాలయలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని సి. ఎం తెలిపారు. వివిధ కారణాల వలన ప్రభుత్వ పధకాలు అందుకోని వారికి ఈ కార్యక్రమం లో మేలు జరుగుతుందని సి. ఎం. అన్నారు.
అనంతరం 26 జిల్లాల కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ లో సి. ఎం మాట్లాడారు. జగనన్న సురక్ష జరిగే గ్రామాల్లో ముందుగా ఎంఎల్ఏ ఎంపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు తెలియ జేయాలన్నారు.
కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే కార్యక్రమంలో భోజన సౌకర్యాలు కల్పించాలని సి. ఎం సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించాలని ఏపీ సింఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.