Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

త్రాగు నీటిలో పురుగులు

.* పట్టించుకోని పంచాయతీ అధికారులు. * ప్రజాఆరోగ్యం పై ఇంత నిర్లక్ష్యమా.?
* పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామస్తులు ధ్వజం.

పాలకోడేరు. నిజం న్యూస్

పాలకోడేరు మండలం గరగపర్రు లూథరన్ చర్చ్ ప్రాంతంలో మంచినీటి కుళాయిలలో అపరిశుభ్ర నీటి తో పాటూ పురుగులు సైతం వస్తున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం చక్కని మంచినీటిని అందించాల్సిన పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ప్రజల ఆరోగ్యమంటే పంచాయతీ అధికారులకు ఇంత నిర్లక్ష్యమా అంటూ ధ్వజమెత్తారు. తప్పని పరిస్థితుల్లో ఆ నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గరగపర్రు లూథరన్ చర్చ్ పరిధి లోని ప్రజలు కోరుతున్నారు. అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించక పోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.