టిపిసిసి అధికార ప్రతినిధిగా జ్ఞాన సుందర్ ఎంపిక పట్ల హర్షం
కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తించి టిపిసిసి అధికార ప్రతినిధిగా జ్ఞాన సుందర్ ఎంపిక పట్ల హర్షం
తుంగతుర్తి జూన్ 21 నిజం చెబుతాం న్యూస్
టి పీసీసీ అధికార ప్రతినిధిగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన అన్నపర్తి జ్ఞాన సుందర్ నియామకం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో తాను సాయశక్తుల కృషి చేస్తున్నట్లు గుర్తించిన రాష్ట్ర టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అధికార ప్రతినిధిగా నియామకం పట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేధావులు శ్రేయోభిలాషులు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు